Site icon vidhaatha

Tomato | డోర్నకల్‌ మార్కెట్లో టమాటాల దొంగతనం.. పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు

Tomato

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొద్ది రోజుల ముందు వరకు కిలో రూ.20 పలికిన టమాటా తాజాగా కిలో రూ.150 నుంచి రూ.180 లు ధర పలుకుతోంది. దీంతో టమాటా కాస్ట్లీ కూరగాయగా మారిపోయింది. ఎన్నడూలేనిది టమాటా దొంగతనం జరగడం చర్చకుదారితీసింది.

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ కూరగాయల మార్కెట్‌లోని దుకాణాల్లో ఇటీవల టమాటాలు మాయమవుతున్నాయి. గాంధీసెంటర్‌లోని కూరగాయల మార్కెట్‌లో రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలికంగా నెట్‌ ఏర్పాటు చేస్తారు. గతంలో ఎప్పుడూ ఇక్కడ దొంగతనాలు జరగలేదు.

కానీ టమాటా రేట్లు భారీగా పెరిగిపోవడంతో ఇక్కడ దొంగలు హస్తలాఘవం చూపించారు. రాత్రివేళ మార్కెట్లో టమాటాలు ఎత్తుకెళ్తున్నారు. బుధవారంరాత్రి కూడా టమాటా దొంగతనం జరిగింది. తెల్లవారి చూసే సరికి టమాటాలు మాయం, దొంగలు మిగతా కూరగాయల జోలికి వెళ్ళలేదని చెబుతున్నారు. ట్రాలీలో ఎత్తుకెళ్ళినట్లు వ్యాపారి లకుపతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Exit mobile version