Site icon vidhaatha

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీని శాసించే ఫ్యూచర్ స్టార్ కిడ్స్ వీరే..

Tollywood: ప్రజంట్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల ఆలోచనా తీరు చాలా మారిపోయింది. ముఖ్యంగా అన్ని భాషల కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను సక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీల పిల్లలకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని సోషల్ మీడియాలోనే తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. మరి ఏ స్టార్ సెలబ్రిటీ కిడ్స్ ఇప్పుడు ముందు వరసలో ఉన్నారో చూద్దాం. ఫస్ట్ అయితే అల్లు అర్హ.. అల్లు వారింట వారసురాలిగా ఫస్ట్ తన కెరీర్ ను శాకుంతలం మూవీతో స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో తన యాక్టింగ్, డైలాగ్స్ కి మంచి మార్కులే సంపాదించుకుంది. ఈ క్యూట్ అర్హ ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీలో యాక్ట్ చేస్తుంది.

నెక్ట్స్ సితార. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్ గా ఓ జ్యూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. నెక్ట్స్ మహేష్ బాబు నటించబోయే మూవీలో ఛాన్స్ అందుకుంది. నెక్ట్స్ మోక్షజ్ఞ బాలకృష్ణ నటవారసుడిగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. త్వరలోనే అకీరాను హీరోగా చూడొచ్చని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

నెక్ట్స్ అభయ్ రామ్, భార్గవ్ రామ్.. వీరిద్దరూ ఎన్టీఆర్ వారుసులు. వీరిలో ఒకర్ని రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమాలో సితార, అభయ్ రామ్ లు అక్కాతమ్ముళ్లుగా యాక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఏది ఏమైనా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కెరీర్ అంతా ఈ స్టార్ కిడ్స్ మీదే ఉంటుందనే విషయం తేలిపోతుంది. చూడాలి మరి ఇంకా ఎవరెవరు సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారో.

Exit mobile version