Site icon vidhaatha

జస్ట్ ప్రోమోతోనే పిచ్చలేపారుగా..

విధాత: వెండితెర‌పై ఒక్కో హీరోది ఒక్కో స్టైల్. ముఖ్యంగా స్టార్ హీరోలైతే వారికంటూ ప్రత్యేకమైన పందా ఉంటుంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన మాస్ కా బాప్ లాంటి యాక్షన్ ఎమోషన్స్ కలగలిపిన సీరియస్ స్టార్‌గా మనకు కనిపిస్తాడు. న‌ట‌సింహంగా రెచ్చిపోతాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చిత్రాలు చూసే వాళ్ళందరికీ ఆయనలోని మాస్ కోణం గురించి బాగానే తెలుసు. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికొస్తే ఆయన తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు లాగానే సీరియస్ యాక్షన్ పండిస్తారు. తెర‌పై హీమ్యాన్‌లా వీరోచితంగా క‌నిపిస్తాడు.

మ్యాచో స్టార్ గోపీచంద్ లౌక్యం త‌ర‌హా పాత్రల కంటే యజ్ఞం లాంటి పాత్రల ద్వారానే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. వీరంతా ఒకచోట కలిసి ఫన్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే అన్ స్టాపబుల్ విత్ NBK s2 లో మనకు కనిపించబోయే దృశ్యం. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్లో బాలయ్య హోస్ట్‌గా.. ప్రభాస్, గోపీచంద్ లు అతిథులుగా హాజరయ్యారు. మధ్యలో ఫోన్ కాల్ ద్వారా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్ ఎంటర్ అయ్యాడు. ఇలా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె 2 ప్రభాస్ ఎపిసోడ్‌కి సంబంధించిన ఫుల్ ప్రోమో విడుదలైంది.

Exit mobile version