- గుజరాత్‌లో జోరందుకున్న ప్రచారం
- ఉచిత విద్యుత్ హామీనిస్తున్న విపక్షాలు
- సౌర విద్యుత్ లాభాలు వివరిస్తున్న బీజేపీ
విధాత: గుజరాత్‌లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల ప్రచార హోరు పెరిగిపోయింది. ప్రదాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఉచిత విద్యుత్తును హామీ ఇస్తుండగా, మోదీ మాత్రం ఇది ఉచిత విద్యుత్తు కాలం కాదని అంటున్నారు. నేడు ప్రజలకు కావాల్సింది ఉచిత విద్యుత్తు కాదు, దాన్నుంచి ఆదాయం పొందేలా చేయాలని, ఆ కళ నాకు తెలుసునని చెప్పుకొస్తున్నారు.
గుజరాత్‌లోని మొఢేరా గ్రామం సంపూర్ణ సౌర విద్యుత్తుతో తమ అవసరాలను తీర్చుకొంటూ ప్రభుత్వానికి మిగులు విద్యుత్తును అమ్మి ఆదాయం పొందుతున్నారని, ఈవిధంగానే గుజరాత్ మొత్తం ఆదాయం పొందేలా చేస్తామని అంటున్నారు. ప్రజలంతా విద్యుత్ కష్టాలతో సతమతమవుతుంటే.. మోదీ మాత్రం సౌరవిద్యుత్ గురించి చెప్తూ.. ఆకాశం వైపు చూడమంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.