విధాత, హైదరాబాద్: జీహెచ్ ఎంసీ డివిజన్ల విభజన అశాస్త్రీయంగా చేశారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. డివిజన్ల విభజనను పరిశీలిస్తే ఒక దగ్గర 82 వేల జనాభా ఉంటే మరో దగ్గర 12 వేలు జనాభా మాత్రమే ఉందన్నారు. రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రజల సౌకర్యార్థం 30 వేల జనాభా ఒక్కొక్క కార్పొరేటర్ కి సమానంగా డిస్ట్రిబ్యూట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. పారదర్శకత్వంతో రిజర్వేషన్ కూడా కేటాయించాలన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా వాటిల్లో పరిపాలన లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ నడుపుతామంటే అది వెర్రి బాగులతనం అవుతుందన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం పార్టీలతో ప్రజాప్రతినిధులతో చర్చలు జరపాలన్నారు. నాకే అన్నీ తెలిసినట్టు రేవంత్ రెడ్డి సర్కారు చేయడం, ఇది మంచి పరిణామం కాదన్నారు. రాజకీయ లబ్దికోసం చిల్లర రాజకీయాల కోసం విభజన చేయవద్దన్నారు.
ఇవి కూడా చదవండి :
Rising Skyscrapers | హైదరాబాద్.. ఇక వర్టికల్ సిటీ! ఆకాశహర్మ్యాలలో మనమే టాప్.. ఎన్నో తెలిస్తే షాకే!!
Telangana Municipal Election Schedule : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
