విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగునుంది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఎన్నికల నోటిషికేషన్ ను రేపు ఆర్వోలు విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు,7 మున్సిపల్ కార్పొరేషన్ లలో ఎన్నికలు జరుగనున్నాయి. 52 లక్షల 43 వేల మంది ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. రేపటి(గురువారం) నుంచి జనవరి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 31న స్క్రూటినీ, ఫిబ్రవరి 3న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. అదే రోజు పోటీ లో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు.
ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి 12న అక్కడ రీ పోలింగ్ నిర్వహిస్తారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఇదే రోజు మున్సిపాల్టీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఫిబ్రవరి 16తో మున్పిపల్ ఎన్నికల ప్రక్రియ ముగివ్వనుంది.
