Yadagirigutta : శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తెలంగాణ కొత్త గవర్నర్ ఎస్పీ శుక్లా

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Shiv Pratap Shukla Yadadri temple visit,

విధాత : తెలంగాణ కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గవర్నర్ దంపతులకు అర్చక బృందం వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ ఈవో భవానీ శంకర్ గవర్నర్ శుక్లాకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందచేశారు. ఆలయ విశిష్టత, నూతన ఆలయ నిర్మాణ విశేషాలను గవర్నర్ కు వివరించారు. గవర్నర్ రాక సందర్భంగా అధికారులు యాదగిరి గుట్ట ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి :

Monalisa | మోనాలిసా వివాహంపై అనేక ప్ర‌చారాలు.. “ఇది లవ్ జిహాద్ కాదు” అంటూ క్లారిటీ
హైదరాబాద్ కు రండి : నెట్ ఫ్లిక్స్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

Latest News