అమరావతి: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయీ దేశానికి చేసిన సేవలను వారు గుర్తుచేశారు.వేదిక వద్ద ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లు, ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సుపరిపాలనా దివస్ బహిరంగ సభలో వారు ప్రసంగించారు. ఈ కార్కక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, కందుల దుర్గేష్ తదితరులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
Odisha : ఒరిస్సాలో ఎన్ కౌంటర్ ?.ఐదుగురు మావోయిస్టుల మృతి
Prabhas | సందీప్‌రెడ్డి వంగా బర్త్‌డే స్పెషల్… ‘స్పిరిట్’పై హైప్ పెంచిన ప్రభాస్ పోస్ట్
