విధాత, హైదరాబాద్ : సినీ నటి ఆమని బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో ఆమని కమలం పార్టీలో చేరిపోయారు. రామచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆమనిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు మేకప్ ఆర్టిస్ట్ శోభలత పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని తమిళ సినిమా నిర్మాతను పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే, రీఎంట్రీలో పలు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 5 చిన్న సినిమాల్లో ఆమె నటించారు. ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపింది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో సాధిస్తున్న దేశాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లుగా ఆమని వెల్లడించారు. నా వంతుగా బీజేపీ నుంచి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Pawan Kalyan : కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తా: వైసీపీకి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
Bharat Taxi App: భారత్ టాక్సీ వచ్చేస్తోంది
