Education Budget Allocation| కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయమే : వేణుగోపాల్

ప్రతీ కేంద్ర బడ్జెట్‌లోనూ విద్యా రంగానికి అన్యాయం జరుగుతుంది అని.. 12 ఏళ్ల మోదీ పాలనలో విద్యా రంగానికి కేటాయింపులు తగినమొత్తంలో జరగటంలేదు అని విద్యారంగ విశ్లేషకులు కే.వేణుగోపాల్ విమర్శించారు.

విధాత, హైదరాబాద్ : ప్రతీ కేంద్ర బడ్జెట్‌లోనూ విద్యా రంగానికి అన్యాయం జరుగుతుంది అని.. 12 ఏళ్ల మోదీ పాలనలో విద్యా రంగానికి కేటాయింపులు తగినమొత్తంలో జరగటంలేదు అని విద్యారంగ విశ్లేషకులు కే.వేణుగోపాల్ విమర్శించారు. ఈ సంవత్సరం రూ. 53.5 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ లో విద్యకు కేటాయించిన నిధులు కేవలం రూ.1,39,289 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్ లో 2.6 శాతం మాత్రమే అని పేర్కొన్నారు. ఈ కేటాయింపులు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం బడ్జెట్ లో శాతంలో పెరుగుదల లేదు అని గుర్తు చేశారు.

గత సంవత్సరం బడ్జెట్ రూ.48,21,000 లక్ష్లల కోట్లు కాగా, విద్యకు కేటాయించింది కేవలం. రూ. 1,28,628 కోట్లు అని, మొత్తం బడ్జెట్ లో 2.6 శాతం మాత్రమే అన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా బడ్జెట్ ప్రసంగాలు ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య అందని ద్రాక్షగా మిగులుతుంది అని వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

కే. వేణుగోపాల్
విద్యారంగ విశ్లేషకులు
9866514577

Latest News