ప్రాణాంతకం ఫాస్ట్‌’ ఫుడ్ …ఇది చూస్తే మళ్లీ తింటారా ?

హైదరాబాద్‌లో అక్రమ ఫాస్ట్‌ఫుడ్ తయారీ కేంద్రంపై దాడుల్లో 110 కిలోల కలుషిత ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల పాడైన నూనె స్వాధీనం. ఆహార భద్రతపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Jun 19, 2026, 1:33 pm IST
Read Time: 4 mins
ప్రాణాంతకం ఫాస్ట్‌’ ఫుడ్ …ఇది చూస్తే మళ్లీ తింటారా ?

నాసిరకంగా తయారు చేసే పానీ పూరీ..నూడిల్స్…ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటి వినియోగం ఎంత హానికరమో ఇప్పటికే పలు సంఘటనలు..తనిఖీలు రుజువు చేశాయి. తాజాగా అలాంటి ప్రాణాంతక ఫాస్ట్ ఫుడ్ ల తయారీ వ్యవహారం మరొకటి వెలుగు చూసింది. హైద‌రాబాద్ హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్మినార్ న్యూ లాడ్ బజార్‌లో లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్న అల్ అక్బర్ గోడౌన్‌పై తనిఖీ అధికారులు( H-FAST) జరిపిన దాడుల్లో భయాంకరమైన నిజాలు వెలుగు చూసిన తీరు చూస్తూ మళ్లీ ఎవరు కూడా ఫాస్ట ఫుడ్ జోలికి వెళ్లకపోవచ్చు.

FSSAI లైసెన్స్ లేకుండానే ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ..అపరిశుభ్ర వాతావ‌ర‌ణంలో ఆహార ప‌దార్థాలను తయారు చేస్తున్నట్లుగా తనిఖీ అధికారులు గుర్తించారు. నిషేధిత కృత్రిమ రంగులతో కూడిన ఆహార పదార్థాలతో, పదే పదే వాడిన పాడైన వంట నూనెతో ఫ్రైడ్ చికెన్ తయారు చేయడం తనిఖీల్లో బయటపడింది.

తనిఖీల్లో కలుషిత 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనె, కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ ఆహారంతో ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ముప్పు ఏర్పడుందని అధికారులు స్పష్టం చేశారు. ఇన్‌స్టెంట్‌గా దొరుకుతోందని ఇల్లీగల్ గా నడిచే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తింటే అంతే వేగంగా ఆస్పత్రిలో చేరడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు.