అమరావతి : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదని..ఒక్కొక్కరిని చంపేస్తామని, మళ్లీ మేం వస్తామని కాంట్రాక్టులను జైలులో పెడుతామని బెదిరింపులకు దిగుతుంటే చూస్తు ఊరుకునేది లేదని, కాలుకు కాలు..కీలుకు కీలు తీస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘అధికారమున్నా లేకున్నా నేను నాలాగే ఉంటానని, బెదిరించే నాయకులకు భయపడనని స్పష్టం చేశారు. వైసీపీ రౌడీలకు యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారు అన్నారు. కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు అన్నారు. రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వస్తామో లేదో అని డిసైడ్ అయ్యే వస్తుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో అమరజీవి జలధార పథకానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. బాధ్యతగా మెలగకుండా దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ వైసీపీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వం తలుచుకుంటూ మావోయిస్టు గెరిల్లా ఉద్యమమే కకావికలమైందని, వందల మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, లక్షల మంది పోలీసులు, ప్రభుత్వం యంత్రాంగం ఉన్న ప్రభుత్వం ఓ రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్లీ రౌడీయిజం మాటలు వినిపించవని హెచ్చరించారు. రెండు రోజులు కిరాయి గూండాల, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. రౌడీలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఇలాంటి మాటలు రావు అన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిని హెచ్చరిస్తున్నానని.. రాజకీయ నిర్ణయం వరకూ తీసుకెళ్లొద్దు అన్నారు.
పెరవలిలో అమరజీవి జలధార పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నది లక్ష్యమన్నారు. ఎక్కువ తీర ప్రాంతాలు కలిపేలా ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు చెప్పారు. 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నట్లు వివరించారు. ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుందంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని పవన్ మండిపడ్డారు. ఎన్నికల్లో దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కూటమి పొత్తు కోసం సీట్ల విషయంలో తగ్గి వ్యవహరించానన్నారు.
ఇవి కూడా చదవండి :
Salman Khan | సల్మాన్ ఖాన్‌తో అరంగేట్రం.. అదృష్టం కలిసిరాని హీరోయిన్లు వీరేనా?
Shraddha Srinath | కుర్రాళ్ల గుండెల్ని అదుపుతప్పేలా చేస్తున్న శ్రద్ధా ఫొటోస్
