Site icon vidhaatha

Viral Video | ఓ ఇంట్లో వేల సంఖ్య‌లో తేళ్లు..

Scorpions | తేలు విష‌పూరిత‌మైన‌ది. అది మ‌న‌ల్ని కుట్టిందంటే.. ప్రాణాల‌కు ముప్పే. తేలు కుట్టిన వెంట‌నే చికిత్స తీసుకుంటే ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు. అలాంటి విష‌పూరిత‌మైన తేళ్లు.. ఓ ఇంట్లో వేల సంఖ్య‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. చీమ‌ల గుంపు మాదిరిగానే తేళ్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఒక‌దానిపై ఒక‌టి పాకుతూ భయంక‌రంగా ఉన్నాయి. ఆ ఇంటి గోడ‌ల‌కు పాకుతున్న తేళ్ల‌ను చూస్తుంటే శ‌రీరం గ‌గుర్పాటుకు గుర‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

అయితే ఈ తేళ్లు ఉన్న ప్ర‌దేశం మాత్రం తెలియ‌రాలేదు. వీడియో వినిపిస్తున్న వాయిస్ ఆధారంగా అది పోర్చుగీస్ అయి ఉంటుంద‌ని నెటిజ‌న్లు అంచ‌నా వేస్తున్నారు. కొంద‌రేమో బ్రెజిల్ అని తెలుపుతున్నారు. తేళ్ల‌కు బ్రెజిల్ ఫేమ‌స్ అని పేర్కొంటున్నారు. గ‌తేడాది కూడా ఈ వీడియోను రెడ్డిట్ పోస్టు చేసింద‌ని మ‌రొక‌రు గుర్తు చేశారు.

అవి అత్యంత ప్రమాదకరమైన డెత్​ స్టాకర్​ తేళ్లని తెలుస్తోంది. ఈ తేళ్ల విషం ఎంతో ఖరీదైనది. ఒక్కో లీటరు 10.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 86 కోట్ల 76 లక్షలు పలుకుతుంది. కానీ ఒక్క లీటరు కావాలంటే ఒక్కో తేలు నుంచి దాదాపు 7లక్షల సార్లు విషం తీయాల్సి ఉంటుంది.

Exit mobile version