విధాత: దట్టమైన నల్లమల్ల అడవుల్లోకి వెళ్తున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఆ అడవుల్లో పెద్ద పులులు సంచరిస్తున్నాయి. ఇందుకు ఈ వీడియోనే సాక్ష్యం. అమ్రాబాద్ పరిధిలోని నల్లమల్ల అడవుల్లో నాగర్‌కర్నూల్ జిల్లా ఫారెస్టు అధికారి రోహిత్ రెడ్డి.. విధి నిర్వహణలో భాగంగా తన సిబ్బందితో నిన్న రాత్రి పెట్రోలింగ్‌కు వెళ్లాడు. వీరు వెళ్తున్న దారిలోనే ఓ పెద్ద పులి ప్రత్యక్షమైంది.
ఇక రోహిత్ రెడ్డి తన మొబైల్ ఫోన్‌లో ఆ పులి దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పులుల, అటవీ జంతువుల సంరక్షణ కు తీసుకుంటున్న చర్యలను పలువురు నెటిజన్లు అభినందించారు.