Site icon vidhaatha

Amrabad Mouse Deer | అమ్రాబాద్ అడవుల్లో చెంగుచెంగున మూషిక జింకలు!

amrabad-mouse-deer-nallamala

Amrabad Mouse Deer | విధాత : అరుదైన, అంతరించే దశలో ఉన్న వన్యప్రాణుల జాతుల అభివృద్ధికి అలవాలంగా మారాయి నల్లమల అడవులు. ప్రస్తుతం నల్లమల అడవుల్లో పరిరక్షింపబడుతున్న జాతుల్లో అంతరించిపోతున్నఅరుదైన మూషిక జింక జాతి కూడా ఒకటి. మూషిక జింక జాతి పరిరక్షణ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు క్రమంగా ముందుకు పడుతున్నాయి. అంతరించిపోయిన మౌస్‌ డీర్‌ జాతిని సంరక్షించి సంతానోత్సత్తి పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ తీసుకొన్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో మరో బ్యాచ్ మూషిక జింకలను తాజాగా అటవీ అధికారులు ప్రత్యేక ఎన్ క్లోజర్ల లోకి వదిలారు. అవి అటవీ వాతవారణానికి అలవాటు పడ్డాక వాటిని అడవిలోకి వదిలుతారు.

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 2017 నుంచి మూషిక జింకల(మౌస్‌డీర్‌) సాఫ్ట్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని పునరుద్ధరించేందుకు అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది సత్ఫలితాలినిస్తుండగా..క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరిగింది. అడవిలో మూషిక జింకల సంచారాన్ని ట్రాప్‌ కెమెరాలతో పరిశీలిస్తున్నారు. ఇప్పటిదాక 20కి పైగా బ్యాచ్ ల(200 వరకు)ను అటవీ శాఖ అడవిలోకి విడుదల చేసింది. . 2009, 2010లో గుజరాత్‌ నుంచి రెండు మగ, నాలుగు ఆడ మూషిక జింకలను తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని జూపార్క్‌లో వీటిని సంరక్షించారు.

సంతానోత్పత్తితో మూషిక జింకల సంఖ్య బాగా పెరిగింది. ఆ తర్వాత వాటిని రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 200వరకు వదలగా., కిన్నెరసాని, నిర్మల్‌, జన్నారం, హయత్‌నగర్‌ మృగవని నేషనల్‌ పార్కులో, పోచారం వైల్డ్‌లైఫ్‌ శాంక్చువరీలో మరో 100కు పైగా మూషిక జింకలను విడిచిపెట్టారు.

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌)లో ప్రస్తుతం 36 పులులు, 2 పులి పిల్లలు ఉన్నాయి. ఇందులో 13 మగ, 20 ఆడ పులులు కాగా.. మరొకటి గుర్తించాల్సి ఉంది. వీటితో పాటు అనేక రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు నల్లమల అవాసాసంగా కొనసాగుతుంది.

 

Exit mobile version