Waterfall in Nallamalla | దట్టమైన నల్లమల్ల అడవుల్లో( Nallamalla Forest ) ఓ జలపాతం( Waterfall ) పర్యాటకులను( Tourists ) ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతోంది. పాలనురగల్లాంటి ఆ జలధారను చూసి పర్యాటకులు మైమరిచిపోతున్నారు. నల్లమల్ల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా( Nagarkurnool District ) అమ్రాబాద్ మండల( Amrabad Mandal ) కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలోని లోతట్టు అడవిలో ఉన్న ఈ జలపాతం వద్దకు సందర్శకులు తరలివస్తున్నారు. సెలవు రోజుల్లో తాకిడి పెరుగుతున్నది. చిన్నా పెద్ద తేడా లేకుండా జలకాలాడుతూ సంతోషంగా.. ఉల్లాసంగా గడుపుతున్నారు.