Srisailam | శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు.. నల్లమల మీదుగా హైదరాబాద్ నుంచి ప్రారంభం

Srisailam | హెలీ టూరిజానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ - శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

సంక్రాంతి వరకు అందుబాటులోకి  

Srisailam | హైదరాబాద్, అక్టోబర్ 14 (విధాత ప్రతినిధి): హెలీ టూరిజానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ – శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్ లోని రామప్ప, లక్నవరానికి విస్తరించాలని యోచిస్తోంది. హెలీ టూరిజం సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్ సైట్ తీసుకురానుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో ఐదు నుంచి ఆరు గంటల పాటు సమయం పట్టనుంది. అయితే హెలికాప్టర్ ద్వారా గంటలో హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి చేరుకోవచ్చు. రాష్ట్రానికి పర్యాటక రంగంలో టూరిస్టులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే రూ. 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈజ్ మై ట్రిప్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు ఇతర ప్రైవేట్ ఏవియేషన్, ఎయిర్ లైన్స్ కంపెనీల భాగస్వామ్యంతో హెలి టూరిజం సేవలను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో హెలికాప్టర్ లో ఆరు నుంచి ఎనిమిది మంది ప్రయాణీకులు ప్రయాణించే అవకాశం ఉంది. నల్లమల అడవులు,కృష్ణానది అందాలను వీక్షిస్తూ ప్రయాణించవచ్చు.