Viral Photo |
ఉడుత.. ఈ పేరు అందరికి సుపరిచితమే. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. చెట్లపై, నేలపై చెంగుచెంగుమని ఎగురుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఉడుతల పరిమాణానికి వస్తే జానెడు కంటే కొంచెం పొడవుగా ఉంటాయి. బూడిద రంగులో ఉండి.. దాని శరీరంపై తెలుపు రంగు చారలు ఉంటాయి. ఈ రకం ఉడుతలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.
కానీ మీరు ఇలాంటి ఉడుతలను చూసి ఉండరు. ఎందుకంటే ఇది పూర్తిగా నలుపు రంగులో ఉండి.. కోతి కంటే ఎక్కువ పరిమాణంలో ఉంది. చెట్టును పాకుతున్న ఈ రకం ఉడుత ఫోటో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉడుత జాతికి చెందినదని పేర్కొన్నారు. ఈ ఉడుత ఇండియాలో ప్రత్యక్ష్యమైంది.. గుర్తించగలరా? అని అడిగారు. ఆ పక్కనే బుక్సా అని రాసుకొచ్చారు ఆయన. అంటే వెస్ట్ బెంగాల్‌లోని బుక్సాలో ఈ భారీ ఉడుత కనిపించినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. మలబార్ జాతి ఉడుత అని కొందరు అంటుంటే.. ఇంకొందరేమో ఇది మలయన్ జాతి ఉడుత అని పేర్కొంటున్నారు.
ఇది చూడటానికి అందంగా ఉంది. కొన్నేండ్ల తిరుపతికి వెళ్లినప్పుడు ఇలాంటి ఉడుత కనిపించింది. 10 – 15 ఏండ్ల క్రితం ముంబైలోని అంధేరి వెస్ట్‌లో కూడా కనిపించిందని ఓ నెటిజన్ తెలిపాడు. ఇలాంటి ప్రత్యేకమైన ఉడుతలు.. పశ్చిమ కనుమలైన మహారాష్ట్ర, కర్ణాటక, కొంకణ్ లో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
One of the world’s largest squirrel species found in #India. Can you identify. Buxa. pic.twitter.com/HZnE2NKLJd
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 13, 2023