TSPSC Leakage Case: ED కస్టడికి TSPSC నిందితులు.. చంచల్ గూడ జైలులో విచారణ

విధాత: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితులు ప్రవీణ్, అట్ల రాజశేఖర్ రెడ్డిలను ఈడి కస్టడికీ అనుమతిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. పేపర్ లీకేజీ పై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఈ కేసులో నగదు అక్రమంగా చలామణి అయిందంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ […]

  • Publish Date - April 15, 2023 / 02:01 PM IST

విధాత: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితులు ప్రవీణ్, అట్ల రాజశేఖర్ రెడ్డిలను ఈడి కస్టడికీ అనుమతిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

పేపర్ లీకేజీ పై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఈ కేసులో నగదు అక్రమంగా చలామణి అయిందంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు (పిఎంఎల్ఏ) కింద ఈడి ఏప్రిల్ 3న ఈసిఐఆర్ కేసు నమోదు చేసింది. కేసులో ముఖ్యమైన ప్రవీణ్, రాజశేఖర్ ను కస్టడిలోకి తీసుకునేందుకు ఈడి ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.

ఈడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం ప్రవీణ్, అట్ల రాజశేఖర్ రెడ్డి లను కస్టడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ కేసులో ఇద్దరూ ఏ1, ఏ2గా ఉన్నారు.

వీరిద్దరిని చంచల్ గూడ జైలులో ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రమేయం ఉందని ఈడి నిర్థారణకు వచ్చినప్పటికీ, ఇద్దరి కోసం న్యాయస్థానం అనుమతి తీసుకుంది.

విదేశాల నుంచి వచ్చి ఇక్కడ టిఎస్ పిఎస్సీ పరీక్ష రాసిన వారిపై కూడా దృష్టి సారించారు. ఈడీ దర్యాప్తు జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (TPCC) హైదరాబాద్‌లోని ఈడి జోనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Latest News