విధాత: బెజవాడలో కరుడుగట్టిన ఇద్దరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు శనివారం మీడియాకు వెల్లడించారు. నున్న పోలీసుస్టేషన్ పరిధిలోని కుందావారి కండ్రిక వద్ద గత నెల 26న మున్నంగి సుబ్బమ్మ (75)ను గుర్తు తెలియని వ్యక్తి కిరాతకంగా కొట్టి గాయపరచి ఆమె మెడలోని బంగారు ఆభరణాలను అపహరించాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించగా ద్విచక్ర వాహనంపై వాంబే కాలనీకి చెందిన పల్లె రాము అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కేదారేశ్వరిపేటకు చెందిన అతని స్నేహితుడు నాగరాజుతో కలిసి మూడు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు రాము గతంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. రైలు ప్రమాదంలో తన కుడికాలుకు గాయమై కాలు కింది భాగాన్ని తొలగించారు. దీంతో కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. తనకున్న చెడు వ్యసనాలను తీర్చుకునేందుకు తేలికగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుని నేరాలు చేయడం ప్రారంభించాడని సీపీ తెలిపారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలతో పరిచయం పెంచుకుని బంగారు ఆభరణాలను దొంగలించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాయకాపురం ప్రాంతంలో సత్యవతి (80) అనే మహిళ ఇంట్లోనూ ఇదే తరహా దొంగతనం చేశాడని.. ఆమెను బలంగా నెట్టేయడంతో తలకు గాయమై చనిపోయిందని వివరించారు. మార్చి 27న అజిత్‌సింగ్ నగర్‌లో వెంకాయమ్మ (75) దగ్గరకు అద్దె ఇల్లు కావాలని వెళ్లి బంగారు అభరణాలు దొంగిలించినట్లు సీపీ వెల్లడించారు. ఈ మూడు నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఒంటరి మహిళలను అంతం చేసే ఇద్దరు నిందితులు అరెస్టు
<p>విధాత: బెజవాడలో కరుడుగట్టిన ఇద్దరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు శనివారం మీడియాకు వెల్లడించారు. నున్న పోలీసుస్టేషన్ పరిధిలోని కుందావారి కండ్రిక వద్ద గత నెల 26న మున్నంగి సుబ్బమ్మ (75)ను గుర్తు తెలియని వ్యక్తి కిరాతకంగా కొట్టి గాయపరచి ఆమె మెడలోని బంగారు ఆభరణాలను […]</p>
Latest News

భారతీయ సినీ పరిశ్రమకు.. బల్గేరియా రెడ్ కార్పెట్!
విద్యార్ధుల ఆందోళనకు దిగిరాక తప్పని మోదీ అహంకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
డాక్టర్ గా వైద్యం.. హీరోగా వినోదం అందించాలన్నదే నా ధ్యేయం! పవన్ మహావీర్
Privacy Victory: Telangana High Court Orders Social Media Platforms to Remove Survivor’s Identity
సామేల్ విమర్శలు..వినాశకాలే విపరీత బుద్ది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్
కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్
క్యూర్ లో జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!
కాక్రోచ్ లతో ముగిసిన కేంద్రం చర్చలు..ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్.!