Warangal చోరీ సొత్తు తాకట్టు పెట్టుకున్న మరో ఇద్దరు అరెస్టు బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్యాస్ స్టౌవ్ రిపేర్ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నిందితుడు జనగాం జిల్లా, రఘునాథపల్లి గ్రామం, ప్రస్తుతం హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో నివాసం వుంటున్న పర్వతం రాజు (27)కి గతంలో కూడా చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది. రాజుతో పాటు చోరీ సొత్తును తాకట్టు పెట్టుకున్న మరో ఇద్దరు నిందితులైన ఆలేరు మండలం […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్యాస్ స్టౌవ్ రిపేర్ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నిందితుడు జనగాం జిల్లా, రఘునాథపల్లి గ్రామం, ప్రస్తుతం హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో నివాసం వుంటున్న పర్వతం రాజు (27)కి గతంలో కూడా చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.
రాజుతో పాటు చోరీ సొత్తును తాకట్టు పెట్టుకున్న మరో ఇద్దరు నిందితులైన ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన చింతకింది రాములు, యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి చెందిన గోవింద్ చౌదరిని సిసిఎస్, దామెర పోలీసులు అరెస్టు చేశారు.
వీరి నుంచి రెండు లక్షల ఇరువై వేల రూపాయల విలువ గల 21.5 గ్రాముల బంగారు, 220 గ్రాముల వెండి అభరణాలు, 15వేల ఎనిమిది వందల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్(Warangal) క్రైమ్ ఏసిపి డేవిడ్ రాజు వెల్లడించిన వివరాలు.. నిందితుడు రాజు ఒంటరిగా వున్న మహిళలను గుర్తించి వారి వద్దకు వెళ్ళి సబ్సిడీలో గ్యాస్ సిలెండర్, స్టౌను ఇప్పిస్తానని నమ్మించి, ఇందుకోసం అధార్ కార్డు కావాలని తెలియజేసి, అధార్ కార్డు కోసం ఇంట్లోకి వేళ్ళే మహిళలను రహస్యంగా అనుసరించి వారి ఇంటిలో బంగారం, డబ్బు చోరీ చేసి అక్కడి నుండి పారిపోయేవాడు.
అలాగే గ్యాస్ స్టౌ మరమ్మత్తు ముసుగులో గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసివున్న ఇండ్లను గుర్తించి రాత్రి సమయాల్లో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీ చేసేవాడని వివరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు చోరీలకు పాల్పడగా, మరో ఏడు చోట్ల తాళం వేసివున్న ఇండ్ల తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడ్డాడు.
నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ డిసిపి మురళీధర్, ఎసిపి డేవిడ్‌రాజు, సిసిఎస్ ఇన్స్‌స్పెక్టర్ రమేష్ కుమార్, ఎస్.ఐలు యాదగిరి, బాబురావు, ఏ.ఎస్.ఐ శివకుమార్, దామెర ఎస్.ఐ రాజేందర్ హెడ్ కానిస్టేబుళ్ళు అంజయ్య, రవికుమార్, వేణుగోపాల్, జంపయ్య, కానిస్టేబుళ్ళు వంశీ, చంద్రశేఖర్,సూర్య ప్రకాష్, వినోద్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.