MMTS రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం నిందితుడి అరెస్టు?
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు మేడ్చల్ జిల్లా గౌడవల్లికి చెందిన జంగం మహేశ్‌గా నిర్ధారించారు. పోలీసులు మహేశ్ ఫోటోను బాధితురాలికి చూపించగా ఆమె నిందితుడిని ఆ ఫోటో ఆధారంగా గుర్తుపట్టింది. మహేశ్ ను గంజాయికి బానిసైన పాత నేరస్తుడిగా పోలీసులు విచారణలో తేల్చారు.

MMTS Train: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు మేడ్చల్ జిల్లా గౌడవల్లికి చెందిన జంగం మహేశ్‌గా నిర్ధారించారు. పోలీసులు మహేశ్ ఫోటోను బాధితురాలికి చూపించగా ఆమె నిందితుడిని ఆ ఫోటో ఆధారంగా గుర్తుపట్టింది. మహేశ్ ను గంజాయికి బానిసైన పాత నేరస్తుడిగా పోలీసులు విచారణలో తేల్చారు. అతడి కోసం గాలింపు చేపట్టిన నాలుగు బృందాలు ఎట్టకేలకు అతడిని పట్టుకున్నట్లుగా సమాచారం. జంగం మహేశ్ భార్య అతడిని వదిలేసి ఏడాది క్రితం వెళ్లిపోయింది. అటు తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేశ్ ఒంటరిగా ఉంటూ గంజాయికి బానిసయ్యాడు.
గంజాయి మత్తులోనే రైలులో యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేడ్చల్ వెలుతున్న ఎంఎంటీఎస్ రైలు మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై మహేశ్ లైంగిక దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో యువతి నడుస్తున్న రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం బాధిత యువతి ఆసుపత్రిలో కోలుకుంటుంది. ఈ ఘటన రాష్ట్రంలో క్షిణించిన శాంతిభద్రతలకు నిదర్శనమంటు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.