Nirmal | డీజిల్ లేక అంబులెన్స్ ఆలస్యం.. రోడ్డు పైనే ఆదివాసీ మహిళ ప్రసవం

Nirmal | వాగులు, వంకలు చేతులపై దాటించినా అందని వైద్యం డీజిల్ లేక రాని అంబులెన్స్ నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: దేశ కీర్తి పతాకం చంద్రుడిపై రెపరెపలాడినా గిరిజన తండాల్లో మాత్రం వైద్య వసతులు అందని దుస్థితి మాత్రం మారకపోవడంతో ఓ ఆదివాసీ మహిళ రోడ్డుపైన ప్రసవించిన విచారణ ఘటన చోటచేసుకుంది. స్థానికులు గ్రామ పరిధిలోని వాగులను, వంకలను చేతులపైన దాటించి ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎదురు చూసినప్పటికీ […]

  • Publish Date - August 25, 2023 / 05:24 AM IST

Nirmal |

  • వాగులు, వంకలు చేతులపై దాటించినా అందని వైద్యం
  • డీజిల్ లేక రాని అంబులెన్స్
  • నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన

విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: దేశ కీర్తి పతాకం చంద్రుడిపై రెపరెపలాడినా గిరిజన తండాల్లో మాత్రం వైద్య వసతులు అందని దుస్థితి మాత్రం మారకపోవడంతో ఓ ఆదివాసీ మహిళ రోడ్డుపైన ప్రసవించిన విచారణ ఘటన చోటచేసుకుంది.

స్థానికులు గ్రామ పరిధిలోని వాగులను, వంకలను చేతులపైన దాటించి ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎదురు చూసినప్పటికీ డీజిల్ లేక అంబులెన్స్ రాకపోవడంతో గిరిజన మహిళ రోడ్డుపై ప్రసవించిన దుస్థితి ఏర్పడింది.

నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసిపెట్ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ గర్బిణీ గంగమనికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, స్థానికులు ఆమెను దొత్తి వాగు దాటించి రహదారిపైకి వచ్చినప్పటికీ…డీజిల్ లేదని ఐటీడీఏ అంబుల్స్ రాక పోవడంతో రోడ్డుపైనే మగ శిశువుకు మహిళా జన్మనిచ్చింది. నాలుగు గంటలు గిరిజన మహిళ పురటి నొప్పులతో రోడ్డుపైనే నరక యాతన అనుభవించింది.

గిరిజన గ్రామాలకు రాకపోకలకు వాగులపై వంతెనలు నిర్మించకపోవడం, స్థానికులు వాగు దాటించినా డీజిల్ కొరతో అంబులెన్స్ రాకపోవడం అత్యంత విచారకరమన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆదివాసీ మహిళ రోడ్డుపైన నాలుగు గంటల పాటు అనుభవించిన ప్రసవ వేదన ఘటనకు పాలకులు ఏం సమాధానం చెబుతారంటూ గిరిజనులు నిలదీస్తున్నారు. తామే వాగులు దాటి వచ్చినా కనీసం తమకు అత్యవసర అంబులెన్స్ వసతిని కూడా కల్పించిన దుస్థితికి పాలకులు సిగ్గుపడాలంటూ గిరిజన సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Latest News