Site icon vidhaatha

TSAT | డీఎస్సీ అభ్యర్థుల కోసం టీసాట్‌ క్లాసులు

విధాత : తెలంగాణలో డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నట్లుగా టిసాట్‌ (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్) వెల్లడించింది. ప్రస్తుతం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులకు టీసాట్‌ ప్రత్యేక క్లాసులు ఈ నెల 18నుంచి 9 రోజులపాటు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని టీసాట్‌ తెలిపింది. కాగా గణితం, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని, మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు రీటెలికాస్ట్ సౌకర్యం ఉంటుందని వెల్లడించింది.

Exit mobile version