Road Accident
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది.
పోలీస్‌ల కథనం ప్రకారం వడియారం జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో లారీ వచ్చి బైక్‌ను ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు రవితేజ 23, బాలాజీ సింగ్ 32 లు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీస్‌లు గుర్తించారు. చేగుంట పోలీస్‌లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతిదేహలను తరలించారు.