Site icon vidhaatha

MLCలుగా నవీన్‌ కుమార్‌, దేశపతి, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవం

విధాత: ఎమ్మెల్యే(MLA) కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ(MLC)ల ఎన్నిక పూర్తయింది. ఎమ్మెల్సీలుగా ఏకగీవ్రం(unanimous)గా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్‌(Deshapati Srinivas), కె.నవీన్‌ కుమార్‌(K. Naveen Kumar), చల్లా వెంకట్రామిరెడ్డి(Challa Venkatrami Reddy)లు రిటర్నింగ్‌ అధికారి(Returning Officer)నుంచి ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. దీంతో ఎమ్మెల్సీల ఎన్నిక పూర్తయినట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

ఎన్నిక ధృవీకరణ పత్రాల స్వీకరణ కార్యక్రమం అసెంబ్లీలో జరిగింది. కార్యక్రమంలో మంత్రలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డిల పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Exit mobile version