US Drone | అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చిన రష్యా..? ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం..!

US Drone | ఉక్రెయిన్‌పై యుద్ధం, అమెరికాతో ఘర్షణ పూరిత వాతావరణం మధ్య మంగళవారం యూఎస్‌ మిలటరీ నిఘా డ్రోన్‌ రీపర్‌ను రష్య ఎస్‌యూ-27 ఫైటర్ జెట్ ఢీకొట్టింది. దాంతో డ్రోన్‌ నల్ల సముద్రంలో కూలిపోయింది. ఇదే సమయంలో అమెరికా సైనిక డ్రోన్‌ను రష్యా కూల్చినట్లుగా కొన్ని మీడియా నివేదిక పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరో వైపు డ్రోన్‌ కూల్చివేత అనంతరం అమెరికా విదేశాంగ […]

  • Publish Date - March 15, 2023 / 09:59 AM IST

US Drone | ఉక్రెయిన్‌పై యుద్ధం, అమెరికాతో ఘర్షణ పూరిత వాతావరణం మధ్య మంగళవారం యూఎస్‌ మిలటరీ నిఘా డ్రోన్‌ రీపర్‌ను రష్య ఎస్‌యూ-27 ఫైటర్ జెట్ ఢీకొట్టింది. దాంతో డ్రోన్‌ నల్ల సముద్రంలో కూలిపోయింది. ఇదే సమయంలో అమెరికా సైనిక డ్రోన్‌ను రష్యా కూల్చినట్లుగా కొన్ని మీడియా నివేదిక పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరో వైపు డ్రోన్‌ కూల్చివేత అనంతరం అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌.. రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్‌ను పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాలోని అమెరికా రాయబారి లిన్ ట్రేసీ సైతం రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖకు గట్టిగానే సమాధానం ఇచ్చినట్లు నెడ్‌ ప్రైస్‌ పేర్కొన్నారు. ఎంక్యూ-9 విమానం అంతర్జాతీయ జలాల మీదుగా సాధారణ విమానం స్థాయిలో వెళ్తుండగా రష్యన్‌ జెట్‌ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో నల్లసముద్రంలో పడిపోయిందని అమెరికా వాదిస్తున్నది. మానవ రహిత డ్రోన్‌ పూర్తిగా నాశనమైందని పేర్కొంది. వాస్తవానికి నల్ల సముద్రం రష్యా – అమెరికాను కలిపే ప్రాంతం. ఉక్రెయిన్‌ విషయంలో చాలా కాలంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పెంటగాన్ ఆరోపణలు.. రష్యా వాదన ఇదీ..

నల్ల సముద్రం మీదుగా అంతర్జాతీయ గగనతలంలో ఎగురుతున్న అమెరికా వైమానిక దళం నిఘా, మానవరహిత MQ-9 డ్రోన్‌ను రెండు రష్యన్ Su-27 విమానాలు అనుసరించాయని, ఆ తర్వాత ఢీకొట్టాయని పెంటగాన్‌ పేర్కొంది. ఢీకొనడానికి ముందు Su-27 జెట్‌లు MQ-9 ముందుకు చాలాసార్లు వచ్చాయని తెలిపింది. దీనిపై రష్యా స్పందిస్తూ తమ యుద్ధ విమానం అమెరికా డ్రోన్‌ను ఢీకొట్టలేదని, అయితే డ్రోన్ అప్పటికే నల్ల సముద్రంలో పడిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా సరిహద్దుల్లో అమెరికా సైనిక డ్రోన్ వేగంగా తిరుగుతోందని పేర్కొంది. ఆ సమయంలోనే కూలిపోయిందని, ఎలాంటి యుద్ధ విమానాన్ని, ఆయుధాన్ని ఉపయోగించలేదని పేర్కొంది.

రష్యా పనేనని ఆరోపణలు..

అయితే, కొన్ని మీడియా నివేదికలు అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చివేశాయని పేర్కొన్నాయి. రష్యన్ జెట్ అమెరికన్ MQ-9 రీపర్ డ్రోన్ ముఖాముఖికి ఢీకొట్టిందని ఆరోపించాయి. అమెరికన్ రీపర్ డ్రోన్, రెండు రష్యా యుద్ధ విమానాలు SU-27 నల్ల సముద్రం మీదుగా అంతర్జాతీయ జలాల్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నాయి. యూఎస్‌ డ్రోన్‌ను కూల్చివేసిన తర్వాత దాంట్లో నుంచి చమురు లీకేజీ అయ్యిందని, రష్యన్‌ జెట్‌ జెట్ డ్రోన్ ప్రొపెల్లర్‌ను దెబ్బతీసినట్లుగా పేర్కొంది. ఆ తర్వాత అమెరికన్ దళాలు డ్రోన్‌ను నల్ల సముద్రంలో డ్రోన్‌ను ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నాయని మీడియా నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉండగా.. ఈ ఘటనతో పరిస్థితులు మరింత దిగజారుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Latest News