విధాత : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. 2019ఎన్నికల ప్రవర్తన నియామావళి ఉల్లంఘన కేసులో నిందితురాలిగా ఉన్న జయప్రద విచారణకు పదేపదే డుమ్మా కొడుతున్నారు. కేసు విచారణకు హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశాలిచ్చినా ఆమె విచారణకు గైర్హాజరవుతున్నారు. ఆగ్రహించిన కోర్టు ఆమె అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జనవరి 10వ తేదీన ఆమెను కోరులో హాజరుపరుచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో యూపీ రాంపూర్ పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.