Site icon vidhaatha

Elephants | ఏనుగుల మ‌ధ్య భీక‌ర‌మైన ఫైటింగ్.. ఎందుకంటే..?

Elephants | ఏనుగులు ఫైటింగ్ చేయ‌డం మీరెప్పుడైనా చూశారా..? అస‌లు ఏనుగులు పోట్లాడుకోవ‌డం చాలా అరుదు అని చెప్పొచ్చు. అయితే రెండు భారీ గ‌జ‌రాజులు పోట్లాడుకున్న దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ద‌క్షిణాఫ్రికా(South Africa)లోని క్రుగ‌ర్ జాతీయ పార్కు (Kruger National Park)లో ఓ రెండు ఏనుగులు ఫైటింగ్ చేశాయి. ఒక‌దానికొక‌టి ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఈ గ‌జ‌రాజుల ఫైటింగ్‌కు భూమి బ‌ద్ద‌లైంది. చెట్లు నేల‌కొరిగాయి. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ప‌లు ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏనుగులు త‌మ భూభాగ స‌రిహ‌ద్దు కోసం పోట్లాడుకున్న‌ట్లు అనిపిస్తుంద‌ని ఓ నెటిజ‌న్ రాసుకొచ్చాడు. స‌రిహ‌ద్దు వివాదంతో పాటు ఆడ ఏనుగు కోసం ఫైటింగ్ చేసిన‌ట్లు ఉంద‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు.

రెండు భారీ ఏనుగులు పోట్లాడుకుంటే అటు భూమి, ఇటు చెట్లు కూడా దెబ్బ‌తింటున్నాయ‌ని మరొక‌రు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Exit mobile version