2024లో వీసా లేకుండా ఏయే దేశాల‌కు వెళ్లొచ్చో తెలుసా?

హాలిడేస్‌లో ఎంజాయ్ చేయ‌డానికి కొంత‌మంది విదేశాల‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం ముందే వీసాలు సిద్ధం చేసుకోవ‌డం అవ‌స‌రం

  • Publish Date - February 20, 2024 / 11:51 AM IST

హాలిడేస్‌లో ఎంజాయ్ చేయ‌డానికి కొంత‌మంది విదేశాల‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం ముందే వీసాలు సిద్ధం చేసుకోవ‌డం అవ‌స‌రం. అయితే.. విదేశాల‌కు వెళ్ల‌డం గ‌తంకంటే ఇప్పుడు చాలా సుల‌భంగా మారిపోయింది. అనేక దేశాలు వీసా లేకుండానే.. అంటే ఆయా దేశాల‌కు వెళ్లిన త‌ర్వాత వీసాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. ఆ మాట‌కొస్తే.. వీసా ఆన్ ఎరైవ‌ల్ స‌దుపాయం క‌ల్పిస్తున్న దేశాల సంఖ్య నానాటికీ పెరుగుతున్న‌ది. త‌ద్వారా దీర్ఘ‌కాలం వీసాల కోసం వెచ్చించాల్సిన ప‌ని త‌ప్పుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ నివేదిక ప్ర‌కారం.. భార‌త‌దేశం నుంచి 57 దేశాల‌కు వీసా లేకుండానే ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఆయా దేశాల‌కు వెళ్లిన త‌ర్వాత వీసా కోసం దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దౌత్య‌ప‌ర‌మైన సంబంధాలు, ఆర్థిక ప్ర‌యోజ‌నాలు, ప‌ర్యాట‌క రంగాన్ని పెంపొందించుకోవ‌డం త‌దిత‌ర అంశాల ఆధారంగా ఆయా దేశాలు వీసా ఆన్ ఎరైవ‌ల్ స‌దుపాయాన్ని క‌లిగిస్తుంటాయి. స‌ద‌రు దేశాల‌కు చేరుకున్న త‌ర్వాత ఎయిర్‌పోర్టులోని ఇమిగ్రేష‌న్ అధికారుల‌కు సంబంధిత ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే.. వీసా ఆన్ ఎరైవ‌ల్‌ను నిర్దేశిత స‌మ‌యానికి మాత్రమే ఇస్తారు. అందుకు నిర్ణీత మొత్తంలో ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత ప‌త్రాల‌న్నీ స‌రిగ్గా ఉంటే వీసా జారీ అవుతుంది.

ఏయే దేశాల్లో ఎంత‌కాలం గ‌డ‌పొచ్చు!


వీసా ఆన్ ఎరైవ‌ల్ కింద ఒక్కో దేశం ఒక్కో నిర్ణీత కాల‌ప‌రిమితికి అనుమ‌తిస్తుంటాయి. ఆఫ్రికా ఖండంలోని బురుండీలో వీసా ఆన్ ఎరైవ‌ల్‌తో 30 రోజులు ఉండ‌వ‌చ్చు. కేప్ వార్డెలో 30 రోజులు ఉండ‌టానికి అవ‌కాశం ఉన్న‌ది. ఇక కామెరూస్‌లో 45 రోజులు, డ‌జిబౌటిలో 31 రోజులు ఉండొచ్చు. సీషెల్స్‌లో ఏకంగా 120 రోజులు ఉండొచ్చు.

ఇత‌ర వివ‌రాలు ఇలా ఉన్నాయి


ఇథియోపియా : ఒక నెల‌

గునియా- బిస్సావు : 90 రోజులు

మ‌డ‌గాస్క‌ర్ : 60 రోజులు

మారిటేనియా : 90 రోజులు

రువాండా : 30 రోజులు

సీషెల్స్ : 3 నెల‌లు

సోమాలియా : 30 రోజులు

టాంజానియా : 30 రోజులు

టోగో : 7 రోజులు

కాంబోడియా : 30 రోజులు

ఇరాన్ : 30 రోజులు

జోర్డాన్ : 30 రోజులు

లావోస్ : 30 రోజులు

మ‌లేషియా : 30 రోజులు

మాల్దీవులు : 30 రోజులు

లావోస్ : 30 రోజులు

మంగోలియా : 30 రోజులు

మ‌య‌న్మార్ : 30 రోజులు

నేపాల్ : 90 రోజులు

ఒమ‌న్ : 10 రోజులు

ఖ‌తార్ : 30 రోజులు

శ్రీ‌లంక : 30 రోజులు

తైమూర్ లెస్టే : 30 రోజులు

తైవాన్ : 14 రోజులు

థాయ్‌లాండ్ : 15 రోజులు

వియ‌త్నాం : 30 రోజులు

ఆర్మేనియా : 120 రోజులు

బెలార‌స్ : 30 రోజులు

జార్జియా : 90 రోజులు

టర్కీ : 30 రోజులు

సెయింట్ లూసియా : 6 వారాలు

ట్రినిడాడ్ అండ్ టొబాగో : 90 రోజులు

మార్షల్ దీవులు : 90 రోజులు

మైక్రోనేషియా : 30 రోజులు

నౌరు : 14 రోజులు

పలావ్ : 30 రోజులు

సమోవా : 60 రోజులు

తువాలు : 1 నెల

బొలీవియా : 90 రోజులు.

Latest News