Site icon vidhaatha

Warangal: ఎమర్జెన్సీని తలపిస్తున్న బీజేపీ పాలన: ఎర్ర‌బెల్లి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనం, ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే నని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు.

మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ ఇలా..

ప్రజాస్వామిక పార్లమెంట్ వ్యవస్థలో ఈ రోజు చీకటి రోజు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసింది. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమే. పరువునష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీలు వున్నారు. మరి వాళ్ళ సంగతేంటి?

వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదు?! ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతున్నది. దేశాన్ని దోచుకునే దొంగల కోసమే పని చేస్తుంది. బీజేపీని వ్యతిరేకించిన ప్రతిపక్షాలపై ఐటీ, ఈడి, సీబీఐ దాడులు చేయిస్తున్నారు. బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఇలాంటి చర్యలను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఖండించాలి. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి అంటూ మంత్రి పిలుపునిచ్చారు.

Exit mobile version