Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక సీఐతో పాటు హెడ్ కానిస్టే బుల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సిపీ ఏవి రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ప్రస్తుతం వి.ఆర్ లో వున్న ఇన్‌స్పెక్టర్ నరేందర్ తో పాటు రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కేసులు నమోదు చేసినందుకుగాను హెడ్ కానిస్టేబుల్ బి.వెంకటయ్య ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు.