Site icon vidhaatha

Warangal | వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చల్లాను ప్రజలు బహిష్కరిస్తారు: తిరుపతి యాదవ్

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పని చేసిన ఉద్యమకారులను అణిచివేస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని కెయూ జాక్ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్ అన్నారు. దశాబ్ద కాలం ఉద్యమంలో పని చేసిన వాళ్ళను బహిష్కరిండం, భజనపరులను,తెలంగాణ ద్రోహులనను పక్కన పెట్టుకున్నారని విమర్శించారు.

ఎస్సి, ఎస్టీ, బీసీ నాయకులను రాజకీయంగా, ఆర్ధికంగా అణిచివేస్తూ కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్ద పీటవేస్తున్నారని విమర్శించారు. పరకాల అమరదామం వద్ద శుక్రవారం జేఏసీ ప్రతినిధులు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడారు. పరకాలలో తెలంగాణ వ్యతిరేకులను పక్కన పెట్టుకొని ఉద్యమకారులను అన్ని రకాలుగా అణిచివేస్తున్న ధర్మా రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

చివరికి సంక్షేమ పథకాలను కూడా తనకు అను కూలంగా ఉన్న వాళ్లకు ఇస్తూ నిరుపేదలకు ద్రోహం చేస్తున్న ఎమ్మెల్యేను ప్రజలు అంత గమిస్తున్నారని అన్నారు. పరకాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమకారులను ఏకం చేస్తూ పార్టీలకు అతీతంగా ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహిస్తామన్నారు.

స్థానికులకే అన్ని రాజకీయ పార్టీలు టికెట్స్ ఇవ్వాలి లేదంటే స్థానికేతురులను తరిమికొట్టే బాధ్యత నియోజకవర్గంలో యువత తీసుకొని నియోజక వర్గాన్ని కాపాడుకునేలా కార్యాచరణ ప్రకటిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం విద్యార్థి జేఏసీ నాయకులుగోవిందు ప్రణయ్,వడ్డేపల్లి సైలన్, కొమ్ముల అజయ్,దిలీప్, పాణి,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version