Site icon vidhaatha

రాత్రంతా సెలబ్రేట్ చేసుకున్నాం: నరేష్, పవిత్రా లోకేష్‌!

విధాత: సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్‌ల మధ్య వ్యవహారం నడుస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ ఈ మధ్య ఓ హోటల్ రూమ్‌లో ఉండగా.. ఆయన మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టు కోవడంతో.. వారిద్దరి మధ్య ఉన్న వ్యవహారం బయటికి వచ్చేసింది.

ఇక రీసెంట్‌గా పవిత్రా లోకేష్‌ని నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అనేలా తాజాగా వారిద్దరూ కలిసి మాట్లాడిన వీడియో చెప్పకనే చెప్పేస్తుంది. ఈ వీడియోలో పవిత్ర లోకేష్‌పై చెయ్యి వేసి.. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ.. వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ఆల్రెడీ వారిద్దరికీ పెళ్లి కూడా అయిపోయే ఉంటుందనేలా అనుమానాలు కలుగుతున్నాయి.

పవిత్ర లోకేష్ కోసం హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొని ఆమెకు కావాల్సినవన్నీ నరేష్ చూసుకుంటున్నాడనేలా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నరేష్‌కి సుమారు 150 ఎకరాల స్థలంలో ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లుగా టాక్ ఉంది. ఆ ఫామ్ హౌస్‌లోనే వీరిద్దరూ మాట్లాడుతున్న వీడియోని షూట్ చేసినట్లుగా తెలుస్తుంది.

ఈ వీడియోలో ఇద్దరూ రాత్రి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పడంతో.. ఒక్కసారిగా వారు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. అయితే వారు సెలబ్రేట్ చేసుకుంటున్నామని అన్నారు కదా.. అని ఏదేదో ఊహించుకుంటారేమో. ఊహించుకున్నా తప్పేముందిలే.. వారు మాట్లాడే తీరు అలాగే ఉందిగా.

సరే విషయంలోకి వస్తే.. అలీ, నరేష్ కలిసి నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి శతవిధాలా ప్రయత్నించగా.. చివరికి ఆహా ఓటీటీ నుంచి భారీ ఆఫర్ రావడంతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుందని, మంచి రివ్యూలు వస్తున్నాయని చెబుతూ.. వారు ఈ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో..

నరేష్ మాట్లాడుతూ.. ముందుగా అలీ, డైరెక్టర్ కిరణ్, ప్రొడ్యూసర్స్‌కు.. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలుగా, ఆర్టిస్ట్‌లుగా పలు సినిమాలు చేసి.. మళ్లీ హీరోలుగా చేసిన సినిమాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్న రాత్రి నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

నాకు వందల కొద్ది మెసేజెస్ వస్తుంటే.. చాలా సంతోషమేసింది. మంచి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ విత్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయని మరోసారి ఈ సినిమా నిరూపించింది. చాలా హ్యాపీగా ఉంది. మేమంతా ఈ సినిమా సక్సెస్‌తో పండుగ చేసుకుంటున్నాం.. అని నరేష్ చెబుతుండగా..

మధ్యలో పవిత్రా లోకేష్ కలగజేసుకుని ‘రాత్రి నుంచి రివ్యూస్ అన్నీ చదివాను.. చాలా బాగున్నాయి..’ అని అంటే.. ‘నాకు తెలుగులో నువ్వు చదివి చెప్పలేదుగా’ అని నరేష్ అన్నారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ.. దాదాపు 41 రివ్యూలు చూశాను. అన్నీ పాజిటివ్‌గానే.. ఇలా ఈ మధ్య కాలంలో చూడలేదు.

వరల్డ్ వైడ్ ప్రీమియర్ స్టార్టయింది. మేమంతా హ్యాపీ.. అందరూ బాగుండాలి.. అందులో మేమూ (పవిత్రను చూపిస్తూ) ఉండాలి అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అంతేకాదు.. నరేష్, పవిత్ర లోకేష్‌ల బంధంపై ఉన్న అనుమానాలకు కూడా క్లారిటీ ఇచ్చేసింది.

Exit mobile version