Site icon vidhaatha

Woman Saree Burning Reels: ఇదెక్కడి పైత్యం..కట్టుకున్న చీరకు నిప్పుతో రీల్స్ !

Woman Saree Burning Reels : రోజురోజుకు జనాలకు వ్యూస్..రీల్స్, సెల్పీ వీడియోల పిచ్చి మరింత ముదిరిపోతుంది. రీల్స్ పిచ్చి..సెల్ఫీల మోజుతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నప్పటికి వాటికి దూరంగా ఉండలేకపోతున్నారు. చివరకు జనాలకు అదంతా ఓ వ్యసనంగా మారిపోయింది. రీల్స్..వ్యూస్ కోసమని నడుస్తున్న రైళ్లకింద పడుకోవడం..వేలాడటం..నదుల్లో, సముద్రాల్లో, పర్వాతాల్లో సాహస విన్యాసాలు చేయడం..వాహనాలపై సర్కస్ ఫీట్లు సహా ఏది పడితే అది..కాదేది రీల్స్, సెల్ఫీలకు అనర్హమన్నట్లుగా పరిస్థితి తయారైంది. రీల్స్, సెల్ఫీల వేలం వెర్రిలో ఆడ, మగ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పోతుంది.

ఇది ఇలా ఉంటే ఓ మహిళ రీల్స్ కోసం ఏకంగా తను కట్టుకున్న చీరకే నిప్పంటించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మహిళ తన ఒంటిపై చీర మంటలతో కాలిపోతుంటే ఆమె రీల్స్ షూట్ లో డాన్స్ చేసింది. వీడియోలో ఆమె డ్యాన్స్ చేసిన పాట తెలుగు సినిమాలోనిది కావడంతో ఆమె తెలుగురాష్ట్రాలకు చెందిన మహిళగా భావిస్తున్నారు. ఒంటిపై కాలుతున్న చీరతో డ్యాన్స్ తో దుస్సాహసం చేస్తూ రీల్స్ చేసిన ఆ మహిళ రీల్స్ పిచ్చి చూసిన నెటిజన్లు ఇదెక్కడి పైత్యంరా నాయనా అనుకుంటున్నారు. మరికొందరు జనం మారిపోయారు మామ…ఇక ఆగదు కాలం అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.

Exit mobile version