Site icon vidhaatha

VH | డప్పు కొట్టి డ్యాన్స్ చేసిన.. కాంగ్రెస్ నేత హనుమంతరావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉత్సాహం, ఆనందం వ్యక్తం చేసేందుకు వయస్సుతో నిమిత్తం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (VH) నిరూపించారు.

పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో బుధవారం సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ డప్పు కొట్టి, ధరువేసి చిందులు దొక్కారు.

వయసు పిల్లలతో పోటీపడి మరి డాన్స్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వయసులో వీహెచ్ స్పీడును చూసి కుర్ర కారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన డ్యాన్స్ కాంగ్రెస్ కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.

Exit mobile version