Zaheerabad | రైతు దంపతులను బలిగొన్న.. అడవి పందుల కంచె

Zaheerabad విధాత, జహిరాబాద్ ప్రతినిధి: అడవి పందుల నుంచి తమ చెరకు తోటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్తు కంచె ఆ రెతు దంపతులనే బలిగొన్న విషాధ ఘటన జహీరాబాద్‌లో చోటుచేసుకుంది. చెరకు తోటకు గడ్డిమందు పిచికారీ చేస్తుండగా ఒక్కసారిగా భార్య విద్యుత్ షాక్ కు గురయ్యింది. అయితే.. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త కూడా షాక్ కు గురయ్యాడు. ఇలా భార్యాభర్తలిద్దరూ కరెంటు షాక్‌కు గురై పొలంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు […]

  • Publish Date - July 26, 2023 / 11:27 AM IST

Zaheerabad

విధాత, జహిరాబాద్ ప్రతినిధి: అడవి పందుల నుంచి తమ చెరకు తోటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్తు కంచె ఆ రెతు దంపతులనే బలిగొన్న విషాధ ఘటన జహీరాబాద్‌లో చోటుచేసుకుంది. చెరకు తోటకు గడ్డిమందు పిచికారీ చేస్తుండగా ఒక్కసారిగా భార్య విద్యుత్ షాక్ కు గురయ్యింది.

అయితే.. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త కూడా షాక్ కు గురయ్యాడు. ఇలా భార్యాభర్తలిద్దరూ కరెంటు షాక్‌కు గురై పొలంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు విషాదానికి గురి చేసింది.