Site icon vidhaatha

కృష్ణ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తా: హీరో మ‌హేశ్‌

విధాత‌: సూపర్‌స్టార్‌ కృష్ణ మృతి తర్వాత నటుడు మహేశ్‌బాబు భావోద్వేగంతో లేఖ రాశారు. కృష్ణ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా గడిపేవారు. ఎలాంటి భయం లేకుండా, ధైర్యంగా.. సాహసంగా ఉండటం కృష్ణ స్వభావం అని తెలిపారు.

నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి. ఇంతకు ముందెన్నడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తున్నది. నాకు ఇప్పుడు ఎలాంటి భయంలేదు. మీ కాంతి నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తా, మీరు మరింత గర్వపడేలా చేస్తానని లేఖలో మహేశ్‌బాబు పేర్కొన్నారు.

Exit mobile version