Site icon vidhaatha

YADADRI | వైభవంగా మహా పూర్ణాహుతి, చక్ర తీర్థం

YADADRI, YADAGIRI GUTTA

విధాత, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు మహా పూర్ణాహుతి చక్రతీర్థం కార్యక్రమాలను శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో మూలవర్యులకు నిత్య ఆరాధనలు, అభిషేకాలు అనంతరం బ్రహ్మోత్సవాల పర్వంలో మహా పూర్ణాహుతిజ్ చక్రతీర్థం ఘట్టాలను నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలకు వేంచేసి ఉన్న దేవతలకు మహాపుర్ణాహుతి ద్వారా హావిస్సులు అందించారు. అనంతరం స్వామి వారి చక్ర తీర్థ స్నాన ఘట్టాన్ని కొండ దిగువన పుణ్య గోదావరి జలయుత లక్ష్మీ పుష్కరణలో భక్తుల గోవింద నామస్మరణ మధ్య వైభవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, తాండూరు వెంకటా చార్యులు ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ గీత, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు , అలాగే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు గురువారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, పూజల అనంతరం ఆశీర్వచనాలు, స్వామివారి ప్రసాదాలు అందించారు.

సాయంత్రం శ్రీ పుష్ప యాగం, దేవతోద్వాసన డోపు ఉత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల 11వ రోజు రేపు శుక్రవారం ఉదయం అష్టోత్తర శతకటాభిషేకం, రాత్రి శృంగారడోలోత్సవం, ఋత్విక్ సన్మానాలతో బ్రహ్మోత్సవాల పర్వం పరిసమాప్తం కానుంది.

Exit mobile version