Life style news | కారులో నీళ్ల బాటిల్‌ మర్చిపోతే అంతే సంగతి.. ఆ నీళ్లు కారును దగ్ధం చేసే ప్రమాదం ఉందట..!

Life style news | వాహనం ఏదైనా బస్సుగానీ, రైలుగానీ, కారుగానీ.. మనం దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెంట నీళ్ల బాటిల్‌ తీసుకెళ్తుంటాం. అయితే వాహనం దిగేటప్పుడు వాటిని మర్చిపోతుంటాం. అయితే బస్సులు, రైళ్లను కిటికీలు పూర్తిగా మూసి పార్క్‌ చేయరు కాబట్టి ప్రమాదం లేదు. కార్లను అయితే విండోస్‌ పూర్తిగా మూసేసి పార్క్‌ చేస్తాం. అలాంటప్పుడు అందులో నీళ్ల బాటిల్‌ మర్చిపోతే ప్రమాదం.

  • Publish Date - June 25, 2024 / 09:15 AM IST

Life style news : వాహనం ఏదైనా బస్సుగానీ, రైలుగానీ, కారుగానీ.. మనం దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెంట నీళ్ల బాటిల్‌ తీసుకెళ్తుంటాం. అయితే వాహనం దిగేటప్పుడు వాటిని మర్చిపోతుంటాం. అయితే బస్సులు, రైళ్లను కిటికీలు పూర్తిగా మూసి పార్క్‌ చేయరు కాబట్టి ప్రమాదం లేదు. కార్లను అయితే విండోస్‌ పూర్తిగా మూసేసి పార్క్‌ చేస్తాం. అలాంటప్పుడు అందులో నీళ్ల బాటిల్‌ మర్చిపోతే ప్రమాదం. కారును ఎండలో పార్కు చేసినప్పుడైతే అందులో వాటర్‌ బాటిల్‌ను అస్సలే ఉంచొద్దని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

వాస్తవానికి నీళ్లకు మంటలను ఆర్పే గుణం ఉంది. కానీ అదే నీళ్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఉన్నప్పుడు, ఆ బాటిల్‌ను కారులో పెట్టి ఎండలో పార్కు చేస్తే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టేనట. ఎందుకంటే ఆ బాటిల్‌ బాగా వేడెక్కినప్పుడు, అందులోని నీళ్లు అంతకంటే వేడిగా మారుతాయట. దాంతో బాటిల్‌లోని పాస్టిక్‌ ఉడికిపోయి మెత్తగా అవుతుందట. ఇలా వేడెక్కిన వాటర్‌ కారులోని సీట్ కవర్లు, డ్యాష్‌బోర్డులు మొదలైన వాటిలోని లెదర్ భాగాలతో రసాయనిక చర్యలు జరిపి మండిపోతుందట.

ఆ మంటలు కారు పూర్తిగా దగ్ధం కావడానికి కారణమవుతాయట. అలా జరగకుండా ఉండాలనే ముఖ్యంగా కారును ఎండలో పార్కు చేయవద్దట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కారును ఎండలో పార్క్‌ చేసినా అందులో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ను ఉంచవద్దట. వాటర్‌ బాటిళ్లతోపాటే పెర్ఫ్యూమ్ బాటిల్స్, లైటర్స్, ఇతర సువాసనల బాటిల్స్ కారులో ఉంచడం ప్రమాదకరం.

Latest News