Courtroom Love Story | పెళ్లంటే నూరేళ్ల అనుబంధం.. పెళ్లంటే రెండు మనసుల కలయిక.. వివాహం అనేది ఓ వ్యక్తి జీవితంలో మరపురాని మధుర క్షణాలుగా గుర్తుండిపోయే ఘట్టం. ఆదిగా అనాదిగా భారతదేశంలో వస్తున్న ఆచారం పెళ్లంటే. పాతకాలంలో భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు, అపార్థాలు వచ్చినా కలిసి ఉంటూ కాపురం చేసేవారు. కానీ, ప్రస్తుత సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ విడాకులు తీసుకుంటున్నారు. సభ్య సమాజానికి రోల్ మోడల్ గా ఉన్న కొందరు స్టార్లు, ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్లు డైవర్స్ పేరుతో భార్యభర్తల అనుబంధాన్ని తెంపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ, కొందరు ఎంత గొడవ పడినా ఎన్ని మనస్పర్థలు వచ్చినా.. చివరివరకు కలిసే ఉంటారు.. ఉండాల్సిందే. గొడవలు, ఇతర విషయాలను భూతద్ధంలో పెట్టి చూడకుండా పరిస్థితులను కాకుండా మనుషులను అర్థం చేసుకుంటే విడిపోవడాలు ఉండవనే విషయాన్ని గ్రహించాలి. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కిన భార్యను ఆ భర్త పాట పాడి తిరిగి ప్రేమించేలా చేసుకుంటాడు.
ఓ మహిళ తన భర్త తో వేగలేక విడాకులు కావాలని కోర్లకు వెళ్లింది. అయితే, తన భార్యపైన ఉన్న ప్రేమతో ఆమెకు విడాకులు ఇవ్వడం భర్తకు ఇష్టం లేదు. న్యాయమూర్తి విచారణ మొదలు పెట్టాడు.. భార్యను ప్రశ్నలు అడగడంతో ఆమె మాటలు, చేష్టలు తన భర్తపై ప్రేమను చూపించాయి. ఇది గ్రహించిన న్యాయమూర్తి వాళ్లిద్దరిని కలిపేందుకు ప్రయత్నం చేశారు. భర్త పాటలు పాడుతాడని తెలుసుకున్న న్యాయమూర్తి.. భార్య ముందు ఓ పాటను పాడలని సూచిస్తారు. దీంతో ఆ భర్త తన ప్రేమనంతా కూడగట్టుకుని ఓ పాట పాడుతాడు. బదాపూర్ సినిమా నుంచి “జీనా-జీనా” అనే సాంగ్ పాడడం మొదలు పెట్టాడు. ఇంకేముంది భర్త ప్రేమ గాత్రానికి మహిళలో ఉన్న ప్రేమ ఉప్పొంగింది. పాట ఇంకా ముందుకు వెళ్తోంది. దీంతో భార్య కళ్లల్లో నీళ్ల సుడిగుండాలు తిరిగాయి. భర్త ఒక్కసారిగా దగ్గరికి తీసుకోవడంతో నీళ్ల సుడిగుండాలు బయటకు తన్నుకొచ్చాయి. తన భర్త భుజం మీద ఆమె వాలిపోయింది. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొడుతూ వాళ్లను ప్రోత్సహించారు. దీంతో వాళ్లిద్దరి విడాకులు క్యాన్సిల్ అవడంతో వాళ్లు ఒక్కటిగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ ఆ భర్తను అభినందిస్తున్నారు. కొందరు విచిత్ర కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా భార్యభర్తలు లేదా ఇద్దరు మనుషుల బంధం బలమైనది అయినప్పుడు ఎవరూ విడదీయలేరు.. వాళ్లూ విడిపోరు. తనకు నచ్చిన మనిషి కావాలంటే ఆ వ్యక్తి కోసం, ఆ ప్రేమ కోసం పోట్లాడాలి తప్ప.. వాళ్లిద్దరి మధ్య జరిగిన గొడవను సాగదీయడం కాదు.
— desi mojito 🇮🇳 (@desimojito) July 15, 2025