Human Fetus | గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని గోరఖ్‌పూర్( Gorakhpur )లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ దంపతులిద్దరూ క్రూరమృగాల్లా ప్రవర్తించారు. కడుపులో పెరుగుతున్న బిడ్డ( Baby )ను అబార్షన్( Abortion ) ద్వారా బయటకు తీశారు. నాలుగు నెలల పిండాన్ని( Fetus ) ఇంట్లో నుంచి బయటకు విసిరేశారు.
ఆ పిండం విద్యుత్ తీగలపై Electric Wires ) వేలాడుతూ కనిపించిన దృశ్యాలు అందర్నీ షాక్‌కు గురి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, విద్యుత్ తీగలకు వేలాడుతున్న పిండాన్ని స్వాధీనం చేసుకున్నారు.
షాజాన్వ రైల్వే స్టేషన్( Sahjanwa railway station ) పక్కనే ఉన్న కేశవాపూర్ పవర్ సబ్ స్టేషన్( Keshavpur power substation ) ఓవర్ హెడ్ తీగలపై పిండం వేలాడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో సబ్ స్టేషన్, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. ఇక నాలుగు నెలల పిండాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.