Rajinikanth | బస్సు కండక్టర్ నుంచి ప్రపంచ సూపర్ స్టార్ వరకు.. రజనీకాంత్ బయోపిక్‌పై ఆసక్తికర ప్రకటన చేసిన ఐశ్వర్య

Rajinikanth | తమిళ సినిమా చరిత్రలో రజనీకాంత్‌కు ఉన్న స్థానం ప్రత్యేకం. ఒకప్పుడు బస్సు కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన, అసాధారణమైన ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తూ అగ్రస్థానానికి చేరుకున్నారు.

Rajinikanth | తమిళ సినిమా చరిత్రలో రజనీకాంత్‌కు ఉన్న స్థానం ప్రత్యేకం. ఒకప్పుడు బస్సు కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన, అసాధారణమైన ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తూ అగ్రస్థానానికి చేరుకున్నారు. అందుకే రజనీకాంత్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమైన కథగా నిలిచింది.ఇలాంటి అసాధారణ జీవిత ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనే ఆలోచన చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ ఆ బయోపిక్‌ను ఎవరు తెరకెక్కిస్తారు? అందులో రజనీకాంత్ పాత్రను ఎవరు పోషిస్తారు? వంటి ప్రశ్నలు పెద్ద చర్చగా మారడంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు అధికారికంగా ముందుకు రాలేదనే అభిప్రాయం ఉండేది.

అయితే, తాజాగా రజనీకాంత్ బయోపిక్‌పై కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నా తండ్రి రజనీకాంత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రం విడుదలైతే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారుతుంది” అని తెలిపారు.ఈ వ్యాఖ్యలతో రజనీకాంత్ బయోపిక్ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిందన్న విషయం తొలిసారిగా బయటకు వచ్చింది. అధికారిక ప్రకటన లేకపోయినా, ఐశ్వర్య చేసిన ఈ కామెంట్స్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. తమ అభిమాన హీరో జీవితాన్ని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

ఇక రజనీకాంత్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన జైలర్కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు సీబీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.

మొత్తంగా ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్, మరోవైపు ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ వార్తలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. సూపర్ స్టార్ ప్రయాణం వెండితెరపై ఎలా ఆవిష్కృతం కానుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News