Ajit Doval : మొబైల్‌, ఇంటర్నెట్‌ వాడని అజిత్‌ దోవల్‌.. ఎందుకో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వాడకుండానే దేశ భద్రతను అజిత్ దోవల్ ఎలా పర్యవేక్షిస్తున్నారు? యువతతో జరిగిన సంభాషణలో తన 'నో మొబైల్' పాలసీ వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను ఎన్‌ఎస్‌ఏ దోవల్ వెల్లడించారు.

Ajit Doval

ప్రస్తుత సమాజంలో ఫోన్‌ (mobile) వాడని వారు ఎవరుంటారు చెప్పండి..? ఉదయం కళ్లు తెరవగానే ఫోన్‌ చూడందే బెడ్‌ దిగరు కొందరు. రీల్స్‌, పోస్టులు, గేమ్స్‌, యూట్యూబ్‌, చాటింగ్‌ అంటూ
రోజులో సగం సమయం ఫోన్‌కే కేటాయిస్తుంటారు. అలాంటిది భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు (National Security Adviser) అజిత్‌ దోవల్‌ (Ajit Doval) మాత్రం అందుకు భిన్నం. ఆయన ఫోన్‌,
ఇంటర్నెట్‌ వంటివి వాడరట. తన రోజూవారీ కార్యకలాపాల్లో వాటికి అస్సలే చోటివ్వకపోవడం విశేషం.

ఫ్యామిలీ, ఇతర దేశాల్లోని ప్రజలతో మాట్లాడేందుకు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫోన్‌ను ఉపయోగిస్తారట. అది కూడా అత్యవసరమైతేనే. లేదంటే అది కూడా లేదు. మొబైల్‌ ,ఇంటర్నెట్‌ (internet) రెండు లేకుండానే తన విధులు నిర్వర్తించేలా ప్లాన్‌ చేసుకుంటారట. వ్యక్తిగత అవసరాలు, రోజువారీ పనుల కోసం ఫోన్లు, ఇంటర్నెట్‌ను వాడనని స్పష్టం చేశారు. దానికి బదులు ఇతర కమ్యూనికేషన్‌ మార్గాలను అనుసరిస్తానని వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3 వేల మందికి పైగా యువ ప్రతినిధులు హాజరైన ‘వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌’లో ఈ మొబైల్‌, ఇంటర్నెట్‌ యుగంలో అవి ఉపయోగించకుండా ఎలా సంభాషిస్తున్నారు..? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Raja Saab | బాక్సాఫీస్ వద్ద ‘ది రాజా సాబ్’ ఊపు తగ్గినా… మూడు రోజుల్లోనే భారీ మైలురాయి
Chiranjeevi | సంక్రాంతి 2026లో మెగా సక్సెస్ .. చిరు, అనీల్ రావిపూడి ఆనందం చూశారా..!

Latest News