Raja Saab | బాక్సాఫీస్ వద్ద ‘ది రాజా సాబ్’ ఊపు తగ్గినా… మూడు రోజుల్లోనే భారీ మైలురాయి

Raja Saab |  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పంద‌న తెచ్చుకుంటుంది. భారీ అంచనాలు, బలమైన ఓపెనింగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా, ఆ తర్వాతి రోజుల్లో మాత్రం కొంత నెమ్మదించింది. అయినప్పటికీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గమనించదగ్గ రికార్డ్ నమోదు చేసింది.

Prabhas and Nidhhi Agerwal in a romantic song sequence from The Raja Saab with bright outdoor visuals.

Raja Saab |  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పంద‌న తెచ్చుకుంటుంది. భారీ అంచనాలు, బలమైన ఓపెనింగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా, ఆ తర్వాతి రోజుల్లో మాత్రం కొంత నెమ్మదించింది. అయినప్పటికీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గమనించదగ్గ రికార్డ్ నమోదు చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ది రాజా సాబ్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే శనివారం నుంచి కలెక్షన్లు త‌గ్గ‌డం ప్రారంభ‌మైంది.

ఇండియాలో సుమారు 51 శాతం డ్రాప్ నమోదు కాగా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఆశించిన స్థాయిలో వసూళ్లు కొనసాగలేదు. ఆదివారం నాటికి దేశీయ వసూళ్లు మరో 20 శాతం తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మూడు రోజులు పూర్తయ్యేసరికి ది రాజా సాబ్ ప్రపంచవ్యాప్తంగా రూ.158 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియా నుంచి రూ.109 కోట్ల నెట్ (సుమారు రూ.130 కోట్ల గ్రాస్) వచ్చాయి. ఓవర్సీస్‌లో ఈ చిత్రం $3 మిలియన్లకు పైగా సంపాదించి మొత్తం కలెక్షన్లను గణనీయంగా పెంచింది. సంక్రాంతి పండుగ ముగిసేలోపు రూ.200 కోట్ల మార్క్‌ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మూడు రోజుల్లోనే ది రాజా సాబ్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 లైఫ్‌టైమ్ కలెక్షన్లు (రూ.128 కోట్లు)ను దాటింది. అలాగే తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ లైఫ్‌టైమ్ వసూళ్లైన రూ.150 కోట్లను కూడా అధిగమించడం విశేషం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ ప్రభాస్ కెరీర్‌లో తొలి హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా నిలిచింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ, డ్యాన్స్‌తో అభిమానులను అలరించడం ప్లస్‌గా మారింది. సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్ వంటి భారీ తారాగణం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో విమర్శకుల నుంచి ఎక్కువగా ప్రతికూల సమీక్షలే వచ్చాయి.

మొత్తంగా చూస్తే, కలెక్షన్ల పరంగా ది రాజా సాబ్ బలమైన ఆరంభం నమోదు చేసినప్పటికీ, లాంగ్ రన్‌లో నిలబడాలంటే పండుగ సెలవులు, వర్డ్ ఆఫ్ మౌత్ ఎంతవరకు సహకరిస్తాయన్నదే కీలకంగా మారింది

Latest News