యూపీలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సహారన్‌పూర్ ఫ్యాసింజర్‌

ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.ఢిల్లీ-సహారన్‌పూర్ డెమో రైలు (01619) మధ్యాహ్నం 1:30 గంటలకు షంటింగ్ ఆపరేషన్ సమయంలో సహరాన్‌పూర్ రైల్వే స్టేషన్ యార్డ్‌లో పట్టాలు తప్పింది.

  • Publish Date - August 4, 2024 / 04:02 PM IST

విధాత, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.ఢిల్లీ-సహారన్‌పూర్ డెమో రైలు (01619) మధ్యాహ్నం 1:30 గంటలకు షంటింగ్ ఆపరేషన్ సమయంలో సహరాన్‌పూర్ రైల్వే స్టేషన్ యార్డ్‌లో పట్టాలు తప్పింది. రైలు ఒక పాయింట్‌లో నావిగేట్ చేస్తున్నప్పుడు పట్టాలు తప్పింది, ఇది వేర్వేరు రైలు మార్గాల మధ్య రైళ్లను మార్చడానికి ఉపయోగించే ట్రాక్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రైలు ఖాళీగా ఉండడంతో ప్రాణనష్టం జరగలేదు. ఇదే రోజు విశాఖలో కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి మూడు బోగీలు దగ్ధమైన సంగతి విదితమే. ఇటీవల దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలపై పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ సాగింది. రైల్వే మంత్రి వైష్ణవ్ దేవ్ రైలు ప్రమాదాల ఘటనలను తక్కువ చేసి చెబుతూ కవచ్ రక్షణ వ్యవస్థను విస్తరించి ప్రమాదాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు.