భువనేశ్వర్ : అతి భయంకరమైన జంతువుల్లో పులులు కూడా ఒకటి. ఇతర జంతువులను, మనషులను వేటాడి చంపేస్తాయి. మరి అలాంటి పులులను అడవుల్లో, జూపార్కుల్లో చూసే ఉంటాం. మన ఇప్పటి వరకు చూసిన పులలన్నీ వేరు. ఇప్పుడు చూడబోయే పులి వేరు. ఈ పులి మొత్తం నలుపు రంగులో ఉంది. నలుపు రంగులో ఉన్న పులులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నలుపు రంగు పులులకు సంబంధించిన ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
అయితే నలుపు రంగు ఉన్న ఈ టైగర్స్ కేవలం ఒడిశాలోని సిమ్లిపాల్ అడవుల్లో మాత్రమే కనిపిస్తాయని పర్వీన్ కశ్వాన్ పేర్కొన్నారు. జన్యు పరివర్తన కారణంగా ఇలా నలుపు రంగు చారలతో జన్మిస్తాయని తెలిపారు. ఈ సూడో మెలనిస్టిక్ టైగర్లు.. 1993లో గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. 1993, జులై21న పొదగడ్ గ్రామానికి చెందిన ఓ చిన్న పిల్లాడు తన ఆత్మరక్షణ కోసం ఈ నల్ల పులిని బాణాలతో చంపినట్లు గుర్తు చేశారు. అప్పట్నుంచి ఈ నల్ల పులి బయటపడిందని తెలిపారు. 1993 నుంచి2007 మధ్య కాలంలో ఈ రకం పులులు కనిపించలేదు. 2007 తర్వాత నల్లపులులను అధికారికంగా ధృవీకరించడం జరిగిందని తెలిపారు.