Site icon vidhaatha

Jharkhand | జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. 40 మీట‌ర్ల దూరంలో ఎగిరిప‌డ్డ ప‌ట్టాలు

Jharkhand | రాంచీ : జార్ఖండ్‌( Jharkhand )లో దారుణం జ‌రిగింది. సాహిబ్‌గంజ్( Sahibganj ) జిల్లాలోని గుర్జి ఎంజీఆర్ రైల్వే పోల్(Gujri MGR railway line ) స‌మీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు పేలుడు ప‌దార్థాలు( Bomb Blast ) అమ‌ర్చారు. పేలుడు ధాటికి ప‌ట్టాలు 40 మీట‌ర్ల దూరంలో ఎగిరిప‌డ్డాయి. ఘ‌ట‌నాస్థ‌లిలో మూడు అడుగుల లోతులో గొయ్యి ఏర్ప‌డింది. ఈ పేలుడు కార‌ణంగా ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న సాహిబ్‌గంజ్ ఎస్సీ అమిత్ కుమార్ సింగ్ ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు మీడియాకు తెలిపారు. ఈ పేల‌డు వెనుక క్రిమిన‌ల్ గ్యాంగ్స్ హ‌స్తం ఉండొచ్చ‌ని అనుమానిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే ఈ రైల్వే ట్రాక్ ఇండియన్ రైల్వే నెట్‌వ‌ర్క్‌లో భాగం కాద‌న్నారు. ఈ రైల్వే లైన్‌ను నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్( NTPC ) ఆధ్వ‌ర్యంలో ఉంద‌న్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని ప‌వ‌ర్ స్టేష‌న్‌కు జార్ఖండ్ నుంచి బొగ్గును త‌ర‌లించేందుకు ఈ లైన్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్‌ను ఎన్టీపీసీ( NTPC )నే నిర్వ‌హిస్తోంద‌న్నారు.

ఈ పేలుడు ధాటికి 470 సెం.మీ. మేర ట్రాక్ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ట్లు పేర్కొన్నారు. భారీ తీవ్ర‌త ఉన్న పేలుడు పదార్థాల‌ను వినియోగించిన‌ట్లు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింద‌న్నారు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేట‌రి అధికారులు ఆధారాలు సేక‌రిస్తున్నారు. అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రుపుతున్నారు.

Exit mobile version