Site icon vidhaatha

Deccan Queen | ద‌య‌చేసి వినండి.. ఘ‌నంగా ‘డెక్క‌న్ క్వీన్’ పుట్టిన‌ రోజు వేడుక‌లు

Deccan Queen | పుట్టిన రోజు వేడుక‌లు( Birthday Celebrations ) జ‌రుపుకోవ‌డం కామ‌న్.. ప్ర‌తి ఏడాది త‌మ‌ పుట్టిన రోజు రాగానే.. ఆ రోజు కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటారు. అలాగే త‌మ‌కు ఇష్ట‌మైన పెంపుడు జంతువుల‌కు కూడా బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్( Birthday Celebrations ) నిర్వ‌హించి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వినూత్నంగా ఓ రైలుకు పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించారు. మ‌రి ఆ రైలు ప్ర‌త్యేక‌త ఏంటి..? అనే విష‌యాల‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆ రైలు పేరు డెక్క‌న్ క్వీన్( Deccan Queen ).. మ‌న దేశంలోని మొట్ట‌మొద‌టి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్( Superfast Express ) కూడా ఇదే. బ్రిటీష్ వాళ్లు 1930 జూన్ 1వ తేదీన డెక్క‌న్ క్వీన్( Deccan Queen ) రైలును ప్రారంభించారు. మొద‌ట్లో ఈ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మ‌న దేశ ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి ఉండేది కాదు. 13 ఏండ్ల త‌ర్వాత అంటే 1943లో భార‌తీయుల‌ను ఈ రైలులో ప్ర‌యాణించేందుకు బ్రిటీష్ ప్ర‌భుత్వం అనుమ‌తించింది.

75 ఏండ్ల నుంచి డెక్క‌న్ క్వీన్‌కు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌..

ప్ర‌స్తుతం డెక్క‌న్ క్వీన్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్( Deccan Queen Superfast Express ) రైలు పుణె( Pune ) నుంచి ముంబై( Mumbai )కి రాక‌పోక‌లు కొన‌సాగిస్తోంది. ఈ రైలు ప్రారంభ‌మై జూన్ 1వ తేదీ నాటికి 95 ఏండ్లు పూర్తి చేసుకుని, 96వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా రైల్వే ప్ర‌వాసీ గ్రూప్ అధ్య‌క్షుడు హ‌ర్ష షా ఆధ్వ‌ర్యంలో డెక్క‌న్ క్వీన్ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. గ‌త 75 ఏండ్ల నుంచి జూన్ 1వ తేదీన బ‌ర్త్ డే వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు హ‌ర్ష తెలిపారు.

భారీ కేక్ క‌టింగ్..

పుణె రైల్వే స్టేష‌న్‌లో డెక్క‌న్ క్వీన్ రైలును పూలు, బెలూన్స్‌తో అలంక‌రించారు. ఆ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ముందు భారీ కేక్ క‌ట్ చేసి ప్ర‌యాణికులు, రైల్వే సిబ్బంది పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. డెక్క‌న్ క్వీన్‌తో ఉన్న అనుబంధాన్ని ప్ర‌యాణికులు నెమ‌రేసుకున్నారు. ఈ రైలుతో త‌మ‌కు విడ‌దీయరాని అనుబంధం ఉంద‌ని పుణె – ముంబై ప్ర‌యాణికులు గుర్తు చేసుకున్నారు.

అధునాత‌న సౌక‌ర్యాలు..

డెక్కన్ క్వీన్​లో మైక్రోవేవ్​ ఓవెన్​, డీప్ ఫ్రీజర్​, టోస్టర్​ లాంటి అధునాతన ప్యాంటీ సౌకర్యాలతో టేబుల్ సర్వీస్​, డైనింగ్ కార్​ ఉన్నాయి. డైనింగ్​ కార్​లో కుషన్డ్​ కుర్చీలు, కార్పెట్​ కూడా ఉన్నాయి. సాధారణంగా ఇండియన్ రైళ్లకు సమయపాలన ఉండందంటారు. కానీ ఈ డెక్కన్​ క్వీన్ సమయానికి రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది.

16 కోచ్‌ల్లో వేలాది మంది ప్ర‌యాణం..

ప్రారంభంలో ఈ రైలులో 2 రాక్​లు, 7 కోచ్​లు ఉండేవి. కానీ నేడు దీనిలో 16 కోచ్​లు ఉన్నాయి. అంతేకాదు దీని 3 ఎయిర్​ కండిషన్డ్​ ఛైర్​ కార్లు, 9 సెకెండ్ క్లాస్​ ఛైర్​ కార్లు, ఒక విస్టా డోమ్ కోచ్​, ఒక డైనింగ్ కార్​, గార్డ్​ బ్రేక్​ వ్యాన్​తో కూడిన ఒక సాధారణ సెకెండ్​ క్లాస్​, ఒక జనరేటర్ కారు ఉన్నాయి. ఇప్పుడు రోజూ వేలాది మంది దీనిలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Exit mobile version