సామాన్యులకు షాక్‌.. పెరిగిన పసిడి ధరలు.. తులం బంగారం ఎంత పలుకుతుందంటే..?

  • Publish Date - October 7, 2023 / 07:51 AM IST

విధాత‌: పసిడి ధరలు సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 22 గ్రాముల తులం పసిడి రూ.100 పెరిగి రూ.52,500 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.70 పెరిగి తులం రూ.57,230 వద్ద ట్రేడవుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.52,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.57,380 వద్ద ట్రేడవుతున్నది. ముంబయి, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల పసిడి రూ.52,500 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.57,230కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.52,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.57,650కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి రూ.52,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.57,230 వద్ద కొనసాగుతున్నది.


ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే స్వల్పం పతనమయ్యాయి. రూ.500 తగ్గి కిలో వెండి రూ.70,600 చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.73వేల ధర పలుకుతున్నది. మరో వైపు ప్లాటినం ధరలు సైతం స్వల్పం తగ్గుముఖం పట్టాయి. ప్లాటినం తులానికి రూ.300 తగ్గి రూ.22,920 పలుకుతున్నది.